మంగళవారం శ్రీ 6 శ్రీ జనవరి శ్రీ 2026
న్యూస్‌రీల్
రూ. కోట్లలో ఆదాయం..టన్నుకు రూ.1,300 విక్రయం
భయం.. భయంగా అధికారులు
ఇసుకంతైనా
సంగాయిగుట్ట తండా వద్ద హల్దీ వాగులో ఇసుక తీస్తున్న ఇటాచీ (ఫైల్)
భయమేదీ?
హల్దీ నుంచి వందలాది టిప్పర్లతో ఇసుక తరలింపు
మెదక్ అర్బన్: ‘హల్దీ నుంచి అక్రమంగా తరలిస్తున్న ఇసుక టిప్పర్లను పట్టుకుంటే.. తెల్లారి తట్టా బుట్టా సర్దుకోవాల్సిందే. ఇది ఓ ప్రధాన శాఖకు చెందిన అధికారి ఆందోళన’ జిల్లా కేంద్రంలో ఉన్నతాధికారులు కొలువు దీరినప్పటికీ.. ఓ ప్రధాన అధికారి రెక్కలు కట్టుకొని కలియ దిరుగుతున్నప్పటికీ.. అక్కడ ఇసుక దోపిడీ ఆగడం లేదు. కూత వేటు దూరంలో ఉన్న సంగాయిగుట్ట తండా వద్ద హల్దీ వాగు నుంచి రెండు నెలలుగా వందలాది టిప్పర్లలో అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు. పెద్దల అండతో సాగుతు న్న దోపిడీని ఆపేందుకు ఏ అధికారి సాహసించడం లేదన్న ఆరోపణలున్నాయి. అక్రమార్కులు ఇస్తున్న మామూళ్లు కూడా, వారిని నోరు మెదపకుండా చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇందిరమ్మ ఇళ్లతో పెరిగిన డిమాండ్
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం నేపథ్యంలో ఇసుకకు భారీ డిమాండ్ ఏర్పడింది. దీంతో ఇసుక మాఫియా కన్ను హల్దీ వాగుపై పడింది. మెదక్ మండలం జానకంపల్లి సమీపంలోని సంగాయిగు ట్ట తండా వద్ద హల్దీ వాగులో రెండు నెలల క్రితం ఇసుక తవ్వకాలు మొదలుపెట్టారు. మొదట మెదక్‌లో స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్ కింద మంజూరైన అభివృద్ధి పనుల కోసం 1,000 టన్నుల ఇసుక అవసరమని, మున్సిపల్ కమిషనర్ మెదక్ ఎమ్మార్వోకు లేఖ రాశారు. అయితే ఆ టెండర్లకు అప్పటికే లీడ్ ఇచ్చినందున, ఇసుక తీయొద్దని రెవెన్యూ అధికారులు బదులిచ్చారు. అయినా ఈ అవకాశాన్ని సాకుగా మలుచుకొన్న ఇసుక మాఫియా గత రెండు నెలలుగా సంగాయిగుట్ట వద్ద నుంచి పగలు, రాత్రి తేడా లేకుండా ఇసుక తీయడం ప్రారంభించారు. వందల కొద్ది టిప్పర్లలో మెదక్, పాపన్నపేట, జహీరాబాద్, కొల్చారం, కౌడిపల్లి, హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఒక్కో టిప్పర్‌కు రూ. 20 వేల చొప్పున వసూలు చేస్తున్నారు. ఇది కొనుగోలు చేస్తున్న దళారులు జిల్లాలోని వివిధ ప్రాంతాలతో పాటు, ఇతర జిల్లాలకు టిప్పర్ల ద్వారా తరలిస్తున్నారు. వారు ఆయా ప్రాంతాల్లో ఇసుక వ్యాపారులకు రూ. 1,300లకు టన్ను చొప్పున విక్రయిస్తున్నారు. ఇప్పటివరకు రూ. కోట్లలో వ్యాపారం జరిగిందన్న ఆరోపణలున్నాయి. కాగా ఇటీవల బీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు సైతం ఆందోళన నిర్వహించి జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఒకటి, రెండు రోజుల ఇసుక రవాణా ఆగింది. తెల్లారి మళ్లీ మొదలైంది. ఈ విషయం రాష్ట్రస్థాయి అధికారుల వరకు వెళ్లడంతో ఆదివారం మైనింగ్ విజిలెన్స్ అధికారులు మెరుపు దాడులు నిర్వహించి, పలు వాహనాలు సీజ్ చేశారు. ఇసుక తరలిస్తే చర్యలు తీసుకుంటామని మెదక్ తహసీల్దార్ లక్ష్మణ్ బాబు హె చ్చరించారు.
మంగళవారం శ్రీ 6 శ్రీ జనవరి శ్రీ 2026


