ప్రజావాణి మరింత బలోపేతం
కలెక్టర్ రాహుల్‌రాజ్
రేగోడ్(మెదక్): మండల స్థాయిలో నిర్వహించే ప్రజావాణికి నోడల్ అధికారులను నియమించి మరింత బలోపేతం చేస్తామని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని రైతువేదికలో నిర్వహించిన ప్రజావాణికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. పలు సమస్యలపై మొత్తం 111 అర్జీలు వచ్చాయి. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజలకు దూరభారం, సమయాన్ని తగ్గించడం కోసమే మండలాల్లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రజావాణిలో వచ్చిన దర ఖాస్తులను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తామని, ఆయా దరఖాస్తులు ఏ అధికారి స్థాయిలో ఉన్నాయో తెలి పే సాంకేతికతను అందుబాటులోకి తెస్తామన్నారు. భూ సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కోర్టు, పోలీస్ పరిధిలో ఉన్న వాటిని సంబంధిత శాఖలకు పంపించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ సీతారావమ్మ, తహసీల్దార్ దత్తారెడ్డి, ఆర్‌ఐలు శరణప్ప, విజయలక్ష్మి, సీనియర్ అసిస్టెంట్ భవాని, ఏఓ రాంప్రసాద్, సర్పంచ్ పర్వీన్ సుల్తాన తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ ఫొటోతో మాత్రమే ఫ్లెక్సీ ఏర్పాటుచేయడం, సీఎం, మంత్రుల ఫొటోలు లేకపోవటంతో ఫ్లెక్సీని వెంటనే తొలగించాలని సిబ్బందిని ఆదేశించారు.


