గ్రామాభివృద్ధికి కృషి చేయండి
మెదక్‌జోన్: నూతనంగా ఎన్నికై న సర్పంచ్‌లు గ్రామాల అభివృద్ధికి పాటు పడాలని ఎమ్మెల్యే రోహిత్‌రావు అన్నారు. సోమవారం పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో నూతన సర్పంచ్‌ల సమక్షంలో జిల్లా సర్పంచ్‌ల ఫోరం కమిటీని ఎన్నుకున్నారు. అ ధ్యక్షుడిగా ఆవుల గోపాల్‌రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకోగా, సర్పంచ్‌ల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు శంకర్‌యాదవ్ నియామకపత్రం అందజేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎంతో నమ్మకంతో ప్రజలు పదవులు కట్టబెట్టారని, ప్రభుత్వం మంజూరు చేసే సంక్షమ పథకాలు ప్రతి గడపకు చేరేలా కృషి చేయాలన్నారు. అనంతరం డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్ మాట్లాడుతూ.. నూతనంగా ఎన్నికై న సర్పంచ్‌లు ప్రతి గ్రామంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి అందేలా చూడాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరా వు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్ చిలుముల సుహాసినిరెడ్డి, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పరశురామ్ గౌడ్, నాయకులు మహిపాల్‌రెడ్డి, సుప్రభాతరావు, రమేశ్‌రెడ్డి ,శ్రీనివాస్‌రెడ్డి ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మెదక్ ఎమ్మెల్యే రోహిత్‌రావు


