విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి
ఘనంగా జిల్లా పరిషత్ పాఠశాల
డైమండ్‌జూబ్లీ వేడుకలు
రామచంద్రాపురం(పటాన్‌చెరు): ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలని మెదక్ పార్లమెంట్ సభ్యులు ఎం.రఘునందన్‌రావు, ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, రాష్ట్ర మాజీ శాసనమండలి ప్రోటెమ్ చైర్మన్ వి.భూపాల్‌రెడ్డి పేర్కొన్నారు. రామచంద్రాపురం పట్టణంలోని జిల్లా పరిషత్ పాఠశాలల్లో శనివారం సాయంత్రం జరిగిన డైమండ్‌జూబ్లీ వేడుకల్లో వారు ముఖ్యఅతిథిలుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఉత్తమ మార్కులు సాధిస్తున్నారన్నారు. విద్యార్థులు చిన్ననాటి నుంచే ఒక లక్ష్యాన్ని పెట్టుకుని పట్టుదలతో చదివి ఉన్నతస్థాయిలో స్థిరపడాలని కోరారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి వారి బంగారు భవిష్యత్‌కు బాటలు వేయాలని కోరారు. విద్యార్థులు తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఉన్నత లక్ష్యంతో ముందుకు సాగాలన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్‌లు బి.పుష్ప, వి.సింధురెడ్డి, మెట్టు కుమార్ యాదవ్, సీనియర్ నాయకులు కుమార్ గౌడ్, విజయ్ కుమార్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు పీ.పీ.రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.


