వారికి ఓటు అడిగే అర్హత లేదు
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మురళీయాదవ్
నర్సాపూర్: కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల నాయకులకు ఓటు అడిగే అర్హత లేదని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మురళీయాదవ్ స్పష్టం చేశారు. శనివారం ఆయన నివాసంలో నర్సాపూర్ పట్టణ పార్టీ ముఖ్య నాయకులతో మున్సిపాలిటీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడిన బీఆర్‌ఎస్‌ను ప్రజలు ఓడించారని, కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే ఆ పార్టీ ఇచ్చిన హామీల అమలులో విఫలం చెంది ప్రజల్లో విశ్వాసం కోల్పోయిందని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం ఉంటుందని మురళీయాదవ్ చెప్పారు. పార్టీ అధిష్ఠానం నిర్ణయించిన అభ్యర్థులను గెలిపించేందుకు సమష్టిగా పని చేయాలని పార్టీ సన్నాహాక సమావేశంలో నిర్ణయించామని మురళీయాదవ్ తెలిపారు. మురళీయాదవ్‌తోపాటు పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు రమేశ్‌గౌడ్, పార్టీ జిల్లా ప్రధానకార్యదర్శి సురేశ్, పార్టీ నాయకులు రాజేందర్, నగేష్‌గౌడ్, ప్రేమ్‌కుమార్, ఆంజనేయులు, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.


