ప్రశాంతంగా మున్సిపోల్స్ నిర్వహించాలి
● జిల్లా అదనపు కలెక్టర్ నాగేష్ ● తూప్రాన్‌లో ఎన్నికల కౌంటింగ్ హాల్ పరిశీలన
తూప్రాన్: మున్సిపల్ ఎన్నికలను శాంతియుత వాతావరణంలో నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ నాగేష్ పేర్కొన్నారు. మున్సిపల్ కమిషనర్ గణేశ్‌రెడ్డితో కలిసి శనివారం పట్టణ సమీపంలోని నోబుల్ కళాశాలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ..త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరుగనున్న దృష్ట్యా ఇప్పటికే ఓటరు జాబితా విడుదల చేశామన్నారు. రిజర్వేషన్లు కూడా ఖరారు కానున్నట్లు పేర్కొన్నారు. ఇందుకోసం ఎన్నికల అనంతరం బ్యాలెట్ బాక్స్‌లను స్ట్రాంగ్ రూంలో భద్రపరచడంతోపాటు కౌంటింగ్ ప్రక్రియ కొనసాగనున్న నేపథ్యంలో కౌంటింగ్ హాల్‌ను పరిశీలించారు. నోబుల్ కళాశాల అన్ని విధాలుగా అనుకూలంగా ఉందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గణేశ్‌రెడ్డి, తహసీల్దార్ చంద్రశేఖర్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.


