రూ. 11.19 కోట్ల బకాయిలు...!
ఆత్మహత్య తప్ప మరో మార్గంలేదు!
చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలతోపాటు ఇదే మండలం చందంపేట ఉన్నత పాఠశాలలను రూ.25 లక్షలు వెచ్చించి మరమ్మతులు చేయించాం. కానీ, రూ.18.30 లక్షలు మాత్రమే వచ్చాయి. ఇంకా రూ.6.70 లక్షలు రావాల్సి ఉంది. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. బిల్లులు విడుదల చేసి ఆదుకోవాలి. లేకుంటే ఆత్మహత్య తప్ప మరో మార్గం లేదు. –మాణిక్యం, కాంట్రాక్టరు
జిల్లా వ్యాప్తంగా 2021–2022లో 313 పాఠశాలల పనులను ప్రారంభించిన పలువురు కాంట్రాక్టర్లు రూ.31.59 కోట్లు వెచ్చించి పాఠశాలలను మరమ్మతులు చేశారు. కాగా వారికి రూ.20.40 కోట్లు విడుదల కాగా ఇంకా రూ.11.19 కోట్లను ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. దీంతో కాంట్రాక్టర్లు పలుమార్లు జిల్లా కలెక్టర్‌కు ప్రజావాణిలో ఫిర్యాదు చేయగా మరికొందరు ఏకంగా పాఠశాలలకు తాళాలు వేశారు. అయినప్పటికీ ఆ బకాయి నిధులు విడుదల కాలేదు. ఇటీవల అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో సైతం పలువురు జిల్లాకు చెందిన కాంట్రాక్టర్లు పాల్గొని అరెస్టు అయ్యారు.


