తక్కువ ధరకే ఇసుక
ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్
మెదక్‌జోన్: ఇందిరమ్మ ఇళ్లకు తక్కువ ధరకే ఇసుకను అందించాలనే ఉద్దేశంతో శాండ్‌బజార్‌ను ఏర్పాటు చేశామని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ అన్నారు. శుక్రవారం మెదక్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీలో నిల్వ ఉంచిన శాండ్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ, ఈ శాండ్ బజార్ ద్వారా అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేశామన్నారు. ఇక నుంచి ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇసుక కావాల్సిన వారు 155242 నంబర్‌కు ఫోన్‌చేసి ఇసుకను బుక్ చేసుకునే వెసులు బాటును కల్పించామన్నారు. కలెక్టర్ రాహుల్‌రాజ్ మాట్లాడుతూ, త్వరలో వాణిజ్య, ప్రైవేట్, ప్రభుత్వ అభివృద్ధి పనులకు సైతం ఇసుకను అందిస్తామని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం టన్నుకు రూ.1,200 చొప్పున ఇస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీవో రమాదేవి, మైన్స్ ఏడీ సంజయ్ కుమార్, పీడీ హౌసింగ్ మాణిక్యం, తహసీల్దార్ లక్ష్మణబాబు, తదితరులు పాల్గొన్నారు.


