పల్లకీపై ఊరేగిన దుర్గమ్మ
పాపన్నపేట(మెదక్): పౌర్ణమిని పురస్కరించుకొని శుక్రవారం రాత్రి ఏడుపాయల్లో వన దుర్గమ్మకు పల్లకీ సేవ కార్యక్రమం నిర్వహించారు. అర్చకులు శంకరశర్మ, పార్ధీవశర్మ దుర్గమ్మ ఉత్సవ విగ్రహానికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి అమ్మవారిని పల్లకిపై ఉంచారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు మంగళహారతులు పట్టారు. భక్తులు పల్లకిని భుజాలపై ఎత్తుకొని ఆలయం నుంచి ప్రధాన వీధి గుండా ఊరేగించారు.
సర్పంచ్‌లకు డీఈఓ విజయ సూచన
కౌడిపల్లి(నర్సాపూర్): పాఠశాలల అభివృద్ధికి సర్పంచ్‌లు కృషి చేయాలని డీఈఓ విజయ సూచించారు. శుక్రవారం కౌడిపల్లికి వచ్చిన సందర్భంగా మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు చంద్రం కృష్ణాగౌడ్ డీఈఓను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ...నూతనంగా ఎన్నికై న సర్పంచ్‌లు విద్య, పాఠశాలల అభివృద్ధికి కృషి చేయాలన్నారు. పాఠశాలల అభివృద్ధిలో అక్కడక్కడా ఎదురవుతున్న సమస్యలపై సర్పంచ్‌లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. బడీడు పిల్లలందరు బడిలో ఉండేలా చూడాలన్నారు. వందశాతం విద్యార్థులు పాఠశాలకు హాజరు అయ్యేలా చూడాలని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎం ఓంప్రకాశ్, నాయకులు దుర్గాగౌడ్, బోయిని వీరయ్య, భూమయ్య, శ్రీనివాస్‌గుప్తా, తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్‌శాఖ ఎస్‌ఈ నారాయణ నాయక్
మెదక్ కలెక్టరేట్: విద్యుత్‌శాఖ అధికారులు, సిబ్బంది కొత్త సంవత్సరంలో మరింత ఉత్సా హంతో వినియోగదారులకు సేవలందించాలని విద్యుత్ శాఖ ఎస్‌ఈ నారాయణ నాయక్ సూచించారు. శుక్రవారం విద్యుత్ శాఖకు చెందిన అధికారులు సిబ్బంది ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ అధికారులంతా సమన్వయంతో పనిచేసి వినియోగదారులకు మెరుగైన సేవలందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ డీఈతోపాటు ఏఈలు, కా ర్యాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఎస్‌బీఐ మేనేజర్ హరినాథ్
నర్సాపూర్: అర్హత ఉన్న గ్రామైఖ్య సంఘాల స భ్యులకు రుణాలు అందెలా చూడాలని ఎస్‌బీఐ మేనేజర్ హరినాథ్ కోరారు. శుక్రవారం స్థానిక ఐకేపీ కార్యాలయంలో జరిగిన కమ్యూనిటీ బేస్డ్ రికవరీ మెకానిజం సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తమ శాఖ పరిధిలోని గ్రామాల్లోని అర్హత ఉన్న సంఘాల సభ్యులకు రుణాలు ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నా మని చెప్పారు. రుణాలు పొందిన సభ్యుల నుంచి రికవరీ సరిగా అయ్యే విధంగా తమకు సహకరించాలని కోరారు. ఐకేపీ ఏపీఎం సంగమేశ్వర్ మాట్లాడుతూ.. వాయిదాలు చెల్లించకుండా మొండి బకాయిలుగా మారిన సంఘాలకు వన్‌టైం సెటిల్మెంట్ అవకాశం కల్పించాలని కోరారు.
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే పథకాలలో రాయితీలు పొందేందుకు ప్రతి రైతు తమ ఐడీని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సిద్దిపేట జిల్లా వ్యవసాయశాఖ అధికారి స్వరూపరాణి సూచించారు. రైతులు తమ పరిధిలోని వ్యవసాయ విస్తరణ అధికారి, మీసేవ కేంద్రాలలో ఈ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. ఈ నెల 10 వరకు గ్రామాల వారీగా వ్యవసాయ విస్తరణ అఽధికారి ఆధ్వర్యంలో ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుందన్నారు.
పల్లకీపై ఊరేగిన దుర్గమ్మ
పల్లకీపై ఊరేగిన దుర్గమ్మ
పల్లకీపై ఊరేగిన దుర్గమ్మ


