బొకేలకు బదులు బ్లాంకెట్స్
మెదక్ కలెక్టరేట్: తన పిలుపు మేరకు సేవా దృక్పథంతో స్పందించిన ప్రతి ఒక్కరికి కలెక్టర్ రాహుల్‌రాజ్ ధన్యవాదాలు తెలిపారు. నూతన సంవత్సరం సందర్భంగా బొకేలు, శాలువాలకు బదులు విద్యార్థులకు చలి నుంచి రక్షణ పొందే బ్లాంకెట్స్ అందించాలని ఆయన పిలుపునకు అనూహ్య స్పందన లభించింది. గురు, శుక్రవారాల్లో ఆయా శాఖల అధికారులు కలెక్టర్‌ను కలిసి బ్లాంకేట్స్ అందజేశారు. వివిధ సంక్షేమ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు 2,500 బ్లాంకెట్స్ అవసరం ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం సుమారు వెయ్యికి పైగా బ్లాంకెట్స్ వచ్చాయని, వీటిని వెంటనే విద్యార్థులకు పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు.


