నాణ్యతా ప్రమాణాలతో విద్యాబోధన
డీఈఓ విజయ
నర్సాపూర్ రూరల్: కస్తూర్బా గాంధీ పాఠశాల విద్యార్థులకు ప్రమాణాలతో కూడిన విద్యతోపాటు నాణ్యమైన భోజనాన్ని అందించాలని డీఈఓ విజయ అన్నారు. శుక్రవారం మండలంలోని చిప్పల్‌తుర్తి కస్తూర్బా గాంధీ పాఠశాలను సందర్శించారు. విద్యా బోధన, ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు. ప్రభుత్వం బడి మానేసిన ఆడ పిల్లల కోసం కస్తూర్బా గాంధీ పాఠశాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. 10వ తరగతి, ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు పరీక్షలు దగ్గర పడుతున్న సమయం వృథా చేయకుండా కష్టపడి చదువుకొని మంచి ర్యాంకులు సాధించాలని ఆమె సూచించారు.


