బాలికల అథ్లెటిక్స్‌లో చాంపియన్‌షిప్
మెదక్‌జోన్: రాష్ట్రస్థాయి 11వ క్రాస్ కంట్రీ చాంపియన్‌షిప్ అథ్లెటిక్స్ పోటీలను శుక్రవారం హైదరాబాద్‌లోని బాలయోగి స్టేడియంలో నిర్వహించారు. ఇందులోభాగంగా అండర్ 20 బాలికల విభాగంలో ఎనిమిది కిలోమీటర్ల పరుగుపందెంలో మెదక్ జిల్లాకు చెందిన బానోత్ అనిత ద్వితీయ స్థానంలో గెలుపొందింది. దీంతో రాష్ట్ర అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి సారంగపాణి ఆర్గనైజింగ్ కార్యదర్శి వెంకటేశ్వర్‌రెడ్డి చేతులమీదుగా అనితకు ట్రోఫీని అందజేశారు. కాగా, ఈ నెల 24న, ఝార్ఖండ్‌లో జరిగే జాతీయస్థాయి పోటీల్లో మెదక్ జిల్లా తరఫున అనిత పాల్గొంటారని మెదక్ అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి మధుసూదన్, కోచ్ అర్జున్ వెల్లడించారు.


