ఆలయాలకు కొత్త శోభ
నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని గురువారం తెల్లవారుజాము నుంచే ఆలయాలకు భక్తులు పోటెత్తారు. జిల్లా కేంద్రంలోని వేంకటేశ్వర ఆలయంలో కలెక్టర్ రాహుల్‌రాజ్ కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే కోదండ రామాలయం, సాయిబాబ ఆలయం, శివాలయాలు, పాపన్నపేట మండలంలోని ఏడుపాయల వనదుర్గామాత ఆలయం భక్తులతో కిటకిటలాడాయి. ప్రఖ్యాతిగాంచిన మెదక్ సీఎస్‌ఐ చర్చికి జిల్లా నలుమూలల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
– మెదక్‌జోన్/పాపన్నపేట(మెదక్)
ఆలయాలకు కొత్త శోభ


