న్యూ ఇయర్ కిక్కు
రూ. 21.32 కోట్ల మద్యం తాగేశారు
కొల్చారం(నర్సాపూర్): నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ మద్యం ప్రియులు ఫుల్‌గా తాగేశారు. డిసెంబర్ చివరి రెండు రోజుల్లో మండలంలోని చిన్నఘనాపూర్ ఇండియన్ మేడ్ లిక్కర్ (ఐఎంఎల్) డిపో ద్వారా రూ. 21.32 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు డిపో వర్గాలు తెలిపాయి. డిసెంబర్ 30, 31 తే దీల్లో ఐఎంఎల్ కేసులు 24,004 అమ్ముడు పోగా, బీరు 14,391 కేసులు అమ్ముడు పోయాయి. 31 నాడు రూ. 8.11 కోట్ల మద్యం అమ్మకాలను జిల్లాలోని మద్యం దుకాణదారులు డిపో ద్వారా కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఐఎంఎల్ డిపోలో బీరు, విస్కీ కలిపి 461 రకాలు అందుబాటులో ఉన్నాయి. నూతన మద్యం పాలసీ ప్రారంభమైన 2025 డిసెంబర్ 1 నుంచి 31 వరకు డిపో నుంచి ఐఎంఎల్, బీరు కలిపి సుమారు రూ. 209.50 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. నెల మొత్తంగా 3,96,427 కేసులు విక్రయించారు. విస్కీలో అత్యధికంగా ఆఫీసర్స్ ఛాయిస్ రిజర్వ్ విస్కీ అమ్ముడు కాగా, దీని విలువ రూ. 12,69,44,132లుగా నమోదైంది. తర్వాత స్థానంలో సిగ్నేచర్ ఇంపీరియల్ బ్లూ క్లా సిక్ గ్రీన్ విస్కీ రూ. 11,80,00,204 అమ్ముడైంది. చివరిస్థానంలో రూ. 4,259లతో హై రైస్ విస్కీ నిలిచింది.


