నూతనోత్సాహంతో పనిచేద్దాం
మెదక్ కలెక్టరేట్: కొత్త సంవత్సరంలో జిల్లా అధికారులు మరింత ఉత్సాహంతో పనిచేయాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ సూచించారు. గురువారం నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని జిల్లాలోని అన్నిశాఖల అధికారులు, సిబ్బంది, పలువురు ప్రజాప్రతినిధులు, ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి కలెక్టర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈసందర్భంగా ఆయన గతేడాది జిల్లాలో సాధించిన అభివృద్ధి, పురోగతి, విజయాలను స్మరించుకున్నారు. ప్రభుత్వ పథకాల ఫలాలు చివరి గడప వరకు చేరేలా చూడాలన్నారు. అనంతరం తహసీల్దార్ అసోసియేషన్‌కు సంబంధించిన నూతన డైరీని ఆవిష్కరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేశ్, టీజీటీఏ నాయకులు, తహసీల్దార్లు పాల్గొన్నారు. అనంతరం సివిల్ సప్లై అధికారులు నిత్యానంద్, జగదీశ్ తన సిబ్బందితో కలెక్టర్‌ను కలిసి దుప్పట్లు అందజేశారు. టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు దొంత నరేందర్ ఆధ్వర్యంలో ఉద్యోగులు కలెక్టర్ రాహుల్‌రాజ్, ఎస్పీ శ్రీనివాసరావును కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
అధికారులతో కలెక్టర్‌కు రాహుల్‌రాజ్


