కష్టపడి చదివితే మంచి భవిష్యత్: ఎస్పీ
మెదక్ మున్సిపాలిటీ: కష్టపడి చదివితే మంచి భవిష్యత్ ఉంటుందని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని బాల సదనంలో పిల్లలతో కలిసి నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. ఈసందర్భంగా వారికి నోట్‌బుక్స్ పంపిణీ చేసి ముచ్చటించారు. క్రమశిక్షణ, కష్టపడి చదివితే ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చన్నారు. పిల్లల భవిష్యత్తే సమాజ భవిష్యత్తు అని, వారు మంచి పౌరులుగా ఎదగాలంటే విద్యే ప్రధాన ఆయుధమని తెలిపారు. నూతన సంవత్సరంలో పిల్లలందరూ ఆరోగ్యంగా, ఆనందంగా చదువులో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ మహేందర్, డీఎస్పీలు ప్రసన్నకుమార్, నరేందర్‌గౌడ్, రంగా నాయక్, సీఐలు మహేశ్, కృష్ణమూర్తి, శైలే ందర్, బాల సదనం అధికారులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అంతకుముందు జిల్లా కేంద్రంలోని వేంకటేశ్వర, ముత్తాయికోటలోని సిద్దేశ్వర ఆలయంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జిల్లా పో లీస్ కార్యాలయంలో వేడుకల్లో పాల్గొన్నారు.


