పోలీస్ అధికారులకు సేవా పతకాలు
మెదక్ మున్సిపాలిటీ: జిల్లాకు చెందిన ము గ్గురు పోలీస్ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం సేవా పతకాలను ప్రకటించడం గర్వకారణంగా ఉందని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన పోలీస్ అధికారులను ప్రోత్సహించే ఉద్దేశంతో సేవా పతకాలను ప్రకటించినట్లు చెప్పారు. ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణలో అంకితభావంతో పనిచేసిన అధికారులను ఈ పతకాల ద్వారా గౌరవిస్తామన్నారు. పతకాలలో భాగంగా మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్, ఎస్సై విఠల్, మెదక్ టౌన్ ఏఎస్సై రుక్సానా బేగం పతకాలకు ఎంపికై నట్లు ఆయన తెలిపారు.
పోలీస్ అధికారులకు సేవా పతకాలు
పోలీస్ అధికారులకు సేవా పతకాలు


