సింగూరు ఖాళీ చేయొద్దు
అసెంబ్లీలో ఎమ్మెల్యే సంజీవరెడ్డి
నారాయణఖేడ్: సింగూరు ప్రాజెక్టును ఖాళీ చేయకుండానే మరమ్మతులకు అవకాశం ఉ న్నందున, మొత్తం ఖాళీ చేయకుండా మరమ్మతుల విషయాన్ని పరిశీలించాలని ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి అసెంబ్లీలో కోరారు. ప్రాజెక్టు ద్వారా జంట నగరాలతో పాటు ఖేడ్, అందోలు, జహీరాబాద్ నియోజకవర్గాలు, కామారెడ్డి జిల్లాకు తాగునీరు అందుతోందన్నారు. వర్షాకాలంలో పుష్కలంగా నీళ్లు చేరినా దిగువకు వదిలారని పేర్కొన్నారు. మరమ్మతుల కోసం పూర్తిగా ఖాళీ చేస్తే సాగు, తాగు నీటికి ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు ఉంటాయన్నారు. 1.60 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే బసవేశ్వర ఎత్తిపోతల పథకానికి నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఖేడ్ నియోజకవర్గంలో రోడ్లకు నిధులు మంజూరైనా, అటవీశాఖ అనుమతులు రాని కారణంగా చేపట్టని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగైదు పంచాయతీలతో కొత్త మండలాలు ఏర్పాటు చేయగా, 14 పంచాయతీలు ఉన్న తడ్కల్‌ను మండల కేంద్రంగా చేయాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని కోరుతూ సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు.


