సాఫ్ట్‌బాల్ పోటీల్లో మెదక్ జట్టుకు సిల్వర్ మెడల్
మనోహరాబాద్(తూప్రాన్): మూడు రోజులుగా మండల కేంద్రంలో జరుగుతున్న 10వ తెలంగాణ అంతర్ జిల్లా సాఫ్ట్‌బాల్ అండర్–14 పోటీల్లో నిజామాబాద్ జిల్లా జట్టు విజయం సాధించింది. సోమవారం నిర్వాహకులు వివరాలు వెల్లడించారు. మొత్తం 21 జట్లు క్రీడల్లో పాల్గొనగా నిజామాబాద్ జట్టు గోల్డ్‌మెడల్, మెదక్ జట్టు సిల్వర్ మెడల్ సాధించాయని, ఉత్తమ ఆటగాడిగా మెదక్ టీంకు చెందిన శ్రీరామ్ ఎంపికై నట్లు తెలిపారు. విజేతలకు గజ్వేల్ నియోజకవర్గ ఇన్‌చార్జి నర్సారెడ్డి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ అనూష, జాతీయ సాఫ్ట్‌బాల్ సంఘం సంయుక్త కార్యదర్శి శోభన్‌బాబు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు అభిషేక్‌గౌడ్, నారాయణగుప్తా, ప్రధాన కార్యదర్శి నవీన్‌కుమార్, మెదక్ జిల్లా యువజన, క్రీడల అధికారి రమేశ్, జిల్లా అసోసియేషన్ ఉపాధ్యక్షుడు అజయ్‌కుమార్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి శ్యాంసుందర్ శర్మ, కోశాధికారి గోవర్ధన్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


