ఎమర్జెన్సీ తర్వాత కష్టకాలంలో ఇందిరాగాంధీని అక్కున చేర్చ
● కాంగ్రెస్‌కు కలిసొచ్చినపంచాయతీ ఎన్నికలు
● సమరోత్సాహంలో బీఆర్‌ఎస్
● ఉనికి చాటుకున్న బీజేపీ
పల్లెల్లో కాంగి‘రేసు’
2025 ఆరంభంలో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్న కాంగ్రెస్‌కు పంచాయతీ ఎన్నికలు కలిసొచ్చాయి. 25 డిసెంబర్ 2024న సీఎం రేవంత్‌రెడ్డి మెదక్ పర్యటనలో భాగంగా చర్చి, ఏడుపాయలను సందర్శించి సుమారు రూ. 58 కోట్ల నిధులను మంజూరు చేయడంతో కేడర్‌లో ఉత్సాహం పెరిగింది. అయితే ఫిబ్రవరిలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పరాజయం ఎదురైంది. పార్టీ బలపరిచిన నరేందర్‌రెడ్డి పరాజయం పాలయ్యారు. రామాయంపేట ఏఎంసీ చైర్మన్ గంగా నరేందర్, జీవన్‌రావు, ఎమ్మెల్యే సొంత గ్రామానికి చెందిన రంగారావు తదితరులు కాంగ్రెస్‌ను వీడి బీఆర్‌ఎస్‌లో చేరారు. మెదక్ కోదండ రామాలయాన్ని ఎండోమెంట్‌లో కలపడంతో వీహెచ్‌పీ, బీజేపీ, బీఆర్ ఎస్‌లు ఆందోళనకు దిగాయి. జిల్లాలో యూరియా కోసం రైతులు చేపట్టిన ఆందోళనలతో కాంగ్రెస్ ఇబ్బందుల్లో పడింది. గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్ సుహాసినిరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్ ఎన్నిక సమయాన, కాంగ్రెస్‌లో లుకలుకలు బయటపడ్డాయి. మెదక్ మండలం జానకంపల్లి శివారులోని హల్దీ వాగు నుంచి కాంగ్రెస్ నాయకుల అండతో పెద్దఎత్తున ఇసుక తరలిస్తున్నా, అధికారులు పట్టించుకోవడం లేదంటూ బీఆర్‌ఎస్ ఆందోళనకు దిగింది. అక్రమ వ్యాపారులు ఇటాచీలు, టిప్పర్లు సర్దుకొని తోక ముడిచారు. ఖరీఫ్‌లో బోనస్ చెల్లింపు, పార్టీ ప్రతిష్టను పెంచింది. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం 2025 ఇచ్చిన గిఫ్ట్‌గా భావించవచ్చు. మొత్తం 492 పంచాయతీల్లో 248 సర్పంచ్‌లు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గెలవటంతో రెట్టించిన ఉత్సాహంతో పార్టీ నాయకులు కొత్త సంవత్సరంలోకి అడుగిడుతున్నారు.
కారులో వర్గపోరు
బీఆర్‌ఎస్‌కు కంచుకోటగా విరాజిల్లిన మెదక్ ఖిల్లాలో హస్తం హవా వీస్తుంది. 2025 పార్టీకి మిశ్రమ ఫలితాలను మిగిల్చింది. పార్టీలో ఇరువురు నాయకుల మధ్య ఉన్న వర్గపోరు కార్యకర్తలను అయోమయానికి గురి చేస్తుంది. ఆ ఇద్దరు నియోజకవర్గంలో ఏ కార్యక్రమానికి వెళ్లినా విడివిడిగానే ఉంటున్నారు. ఒక వేళ కలిసినా, ఎడముఖం, పెడముఖంగానే వ్వవహరిస్తున్నారు. బహిరంగా సమావేశాల్లో రాబోయే ఎన్నికల్లో నేనే ఎమ్మెల్యేనంటూ కంఠారెడ్డి తిరుపతిరెడ్డి స్వరం పెంచడం అయోమయానికి దారి తీస్తుంది. యూరియా ఆందోళనలో బీఆర్‌ఎస్ చురుగ్గా పాల్గొంది. రుణమాఫీ, బోనస్ చెల్లింపుపై మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి, పద్మారెడ్డి, శశిధర్‌రెడ్డి, కంఠారెడ్డి తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో జరిపిన ఆందోళన ప్రజల్లో చైతన్యం రగిలించింది. గత నెలలో జాగృతి అధ్యక్షురాలు కవిత జిల్లా పర్యటనలో బీఆర్‌ఎస్ నాయకులపై విమర్శలు గుప్పించి పార్టీని ఇరకాటంలో పెట్టారు. ముఖ్యంగా మాజీ మంత్రి హరీశ్‌రావుపై చేసిన విమర్శలు గందరగోళం సృష్టించాయి. పంచాయతీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ 172 పంచాయతీలు గెలుచుకొని కాంగ్రెస్‌కు గట్టి పోటీనిచ్చింది. మూడో విడత ఎన్నికల్లో 84 స్థానాలతో మొదటి స్థానంలో నిలిచింది. హల్దీ నుంచి ఇసుక అక్రమ రవాణాను ఆందోళన ద్వారా అడ్డుకోగలిగింది. 42 శాతం బీసీ రిజర్వేషన్లను అమలు చేయాలంటూ ఆందోళన నిర్వహించింది. కాగా బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి స్వగ్రామం కోనాపూర్‌లో బీఆర్‌ఎస్ సర్పంచ్ అభ్యర్థి ఓడిపోవడం కొసమెరుపు.
మెతుకుసీమలో కమలం వాడింది. 2025లో పార్టీ ఉనికి చాటుకోవడానికి నానాపాట్లు పడాల్సి వచ్చింది. ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గం నుంచి మల్క కొమురయ్య, అంజిరెడ్డి విజయం సాధించడం పార్టీకి పెద్ద ఊరటగా భావించవచ్చు. ఫిబ్రవరిలో వాల్దాస్ మల్లేశ్‌గౌడ్‌ను జిల్లా పార్టీ అధ్య క్షుడిగా నియమించారు. ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమైందనే ఆరోపణలున్నాయి. కేంద్ర ప్రభుత్వ పథకాలను ఇంటింటికీ వివరించలేకపోతున్నారు. కొంతమేర ఆందోళనలు నిర్వహించినప్పటికీ ఆశించిన ఫలితాలు పొందలేకపోయిందనే ప్రచారం ఉంది. కాగా పంచాయతీ ఎన్నికల్లో చాలా చోట్ల కనీసం పోటీకి దిగే సాహసం చేయక పోవడం, పార్టీ కేడర్ బ లహీనతను తెలియజేసింది. జిల్లాలో కేవలం 17 చోట్ల మాత్రమే విజయం సాధించింది. రెండు, మూడో విడత ఎన్నికల్లో మాత్రమే ఉనికి చాటుకుంది.
కమలం.. కకావికలం
ఎమర్జెన్సీ తర్వాత కష్టకాలంలో ఇందిరాగాంధీని అక్కున చేర్చ


