వృథాగా జలం..
పట్టించుకోరేం..
మండలంలోని నారాయణపూర్‌లో తాగునీరు వృథాగా పోతున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. గ్రామ ప్రధాన రహదారి వద్ద ఉన్న బోరు మోటార్ నుంచి సమీప ప్రజలు తాగునీటి అవసరాలు తీర్చుకుంటున్నారు. మిగితా సమయంలో బోరు మోటార్‌ను ఆఫ్ చేసేవారు లేకపోవడంతో రోజంతా తాగునీరు మురికి కాలువ పాలవుతోంది. అధికారులు, పంచాయతీ పాలకవర్గం సైతం పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. స్టార్టర్ బోర్డు ఏర్పాటు చేసి నీరు వృథా అవ్వకుండా అరికట్టాలని కోరుతున్నారు. – నర్సాపూర్ రూరల్


