పార్టీ కోసం కష్టపడే వారికి గుర్తింపు | - | Sakshi
Sakshi News home page

పార్టీ కోసం కష్టపడే వారికి గుర్తింపు

Dec 29 2025 10:52 AM | Updated on Dec 29 2025 10:52 AM

పార్టీ కోసం కష్టపడే వారికి గుర్తింపు

పార్టీ కోసం కష్టపడే వారికి గుర్తింపు

మెదక్‌జోన్‌: పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందని డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్‌ అన్నారు. కాంగ్రెస్‌ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం రాందాస్‌ చౌరస్తాలో జెండాను ఆవిష్కరించారు. అంతకుముందు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. బడుగు, బలహీన వర్గాలకు కాంగ్రెస్‌ తల్లి లాంటిదన్నారు. స్వాతంత్య్ర పోరాటం, దేశ నిర్మాణంలో ఎనలేని పాత్ర ఉందని కొనియాడారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, టీపీసీసీ పరిశీలకులు శ్రవణ్‌కుమార్‌, వ రప్రసాద్‌ ఆధ్వర్యంలో పట్టణంలో ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు. కాగా జిల్లా కమిటీ సభ్యుల ఎన్నిక కోసం దరఖాస్తులు స్వీకరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నేతలు చంద్రపాల్‌, సుప్రభాత్‌ రావు, శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యేకు అధికార దాహం ఎక్కువ

నర్సాపూర్‌: నర్సాపూర్‌ ఎమ్మెల్యే సునీతారెడ్డికి పదవి ఆకాంక్ష, అధికార దాహం ఎక్కువని డీసీసీ అద్యక్షుడు ఆంజనేయులుగౌడ్‌ విమర్శించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజకీయ భిక్ష పెట్టిన తల్లిలాంటి కాంగ్రెస్‌కు మోసం చేసి బీఆర్‌ఎస్‌లో చేరారని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ హయాంలో డబుల్‌ బెడ్రూం ఇళ్ల పేరుతో ఆ పార్టీ నాయకులు ఇసుకను అమ్ముకున్నారని మండిపడ్డారు. తమ పార్టీలోని కొందరు నాయకులు ఇతర పార్టీ నాయకులతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకొని పార్టీకి అన్యాయం చేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్‌ సుహాసినిరెడ్డి, నాయకులు పాల్గొన్నారు.

డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement