‘హక్కుల కోసం పోరాటం’
పటాన్‌చెరు టౌన్: ఐక్య పోరాటాల సారధి సీఐటీయూ అని సంఘం జిల్లా కోశాధికారి రాజయ్య అన్నారు. ఆదివారం పట్టణంలోని శ్రామిక భవన్‌లో జరిగిన సీఐటీయూ కార్య కర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 31వ తేదీ నుంచి జనవరి 4 వరకు విశాఖపట్నంలో జరగనున్న సీఐటీయూ అఖిల భారత మహాసభలను కార్మిక వర్గం జయప్రదం చేయాలని పిలుపునిచ్చా రు. కార్యక్రమంలో నాయకులు శేషగిరి, త్రిమూర్తులు, జయకుమార్, చంద్రకిరణ్ సింగ్, శ్రీనివాస్, నారాయణ, రాజు, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కొనసాగుతున్న
సాఫ్ట్‌బాల్ పోటీలు
మనోహరాబాద్(తూప్రాన్): మండల కేంద్రంలో రాష్ట్రస్థాయి అండర్–14 సాఫ్ట్‌బాల్ పోటీలు కొనసాగుతున్నాయి. ఆదివారం మెదక్, నిజామాబాద్, సిద్దిపేట, జగిత్యాల, హన్మకొండ, హైదరాబాద్, మంచిర్యాల, ని ర్మల్ జట్లు క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాయని నిర్వాహకులు తెలిపారు.


