అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం
ఎస్పీ శ్రీనివాసరావు
రామాయంపేట(మెదక్): అసాంఘిక కార్యకలాపా లు చోటు చేసుకోకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశించారు. శనివారం సాయంత్రం రామాయంపేట పోలీస్‌స్టేషన్ ను సందర్శించి మాట్లాడారు. ప్రతిరోజూ గ్రామాల్లో పర్యటిస్తూ సైబర్ నేరాలు, రోడ్డు భద్రతా నియమాలు, మహిళల భద్రత, షీటీం సేవలు, మాదక ద్రవ్యాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. విలేజ్ పోలీస్ అధికారి వ్యవస్థ ద్వారా ఎప్పటికప్పుడు గ్రామాల నుంచి పూర్తిస్థాయి సమాచారం సేకరించి త్వరితగతిన చర్యలు తీసుకోవాలన్నారు. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని, కేసుల విచారణ వేగవంతం చేయాలన్నారు. బాధితులకు సకాలంలో న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలపై కఠినంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. ఆయన వెంట తూప్రాన్ డీఎస్పీ నరేందర్‌గౌడ్, సీఐ వెంకట్‌రాజాగౌడ్, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ సందీప్‌రెడ్డి, ఎస్‌ఐ బాల్‌రాజ్ ఉన్నారు.


