క్రీడలతో మానసిక ఉల్లాసం
మనోహరాబాద్(తూప్రాన్): క్రీడలతో మానసికోల్లాసంతో పాటు ఆత్మస్థైర్యం పెరుగుతుందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్ సుహాసినిరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. శనివారం మండల కేంద్రంలో 10వ అంతర్‌జిల్లా అండర్ 14 సాఫ్ట్‌బాల్ పోటీలను ప్రారంభించి మాట్లాడారు. యువత క్రీడల్లో పాల్గొని భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలన్నారు. క్రీడాకారులకు స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలు వస్తాయన్నారు. కార్యక్రమంలో జాతీయ సాఫ్ట్‌బాల్ ఫెడరేషన్ జాయింట్ సెక్రటరీ శోభన్‌బాబు, రాష్ట్ర సెక్రటరీ నవీన్‌కుమార్, రాష్ట్ర సర్పంచ్‌ల ఫోరం మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహిపాల్‌రెడ్డి, ఒలింపిక్ అబ్జర్వర్ కరణం గణేశ్ రవికుమార్, ప్రధాన కార్యదర్శి నాగిరెడ్డి, శ్యాంసుందర్‌శర్మ, వెంకటేశం, రేణుక, వాసు, అభిషేక్, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.


