బీఆర్‌ఎస్ కంచుకోట బద్దలు కొట్టాం
● హరీశ్‌ను ఓడించేందుకు తానే బరిలోకి దిగుతా..
● మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు
నిజాంపేట(మెదక్): పంచాయతీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ కంచుకోటను బద్దలు కొట్టామని, త్వరలో హరీశ్‌రావును ఓడించేందుకు తానే స్వయంగా బరిలోకి దిగుతానని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన సర్పంచ్‌ల ఆత్మీయ సమ్మేళానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా పలువురు సర్పంచ్‌లు కాంగ్రెస్‌లో చేరగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సిద్దిపేటలో కాంగ్రెస్‌ను పటిష్టం చేస్తున్నట్లు చెప్పారు. హరీశ్‌రావు సీఎం కావాలని ఆశలు పెట్టుకున్నాడన్నారు. గత ప్రభుత్వంలో 90 శాతం సర్పంచ్‌లను ఇబ్బందులకు గురిచేశారని మండిపడ్డారు. కులాలతో రాజకీయం చేయొద్దన్నారు. నిజాంపేట మండలంలో మంచి మెజార్టీ సాధించినట్లు పేర్కొన్నారు. నూ తన ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచ్‌లు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


