
మహిళా సంఘాలు మార్కెటింగ్ చేయాలి
చేగుంట(తూప్రాన్): మహిళా సంఘాలు గ్రూపుగా ఏర్పడి మార్కెటింగ్ చేయాలని డీఆర్డీఏ అసిస్టెంట్ పీడీ సరస్వతి అన్నారు. చేగుంట ఐకేపీ కార్యాలయంలో 17వ వార్షిక సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళా సంఘాల సభ్యులు గ్రూపుగా ఏర్పడి పిండిమర, హోటల్, ఫుడ్‌ప్రాసెసింగ్, కోళ్ల పెంపకం వంటి యూనిట్లు ఏర్పాటు చేసుకొని వ్యాపారాలు నిర్వహించాలని తెలిపారు. జిల్లాలోని కొన్ని సంఘాల సభ్యులు గ్రూపు వ్యాపారాలను నిర్వహించి నెలకు రూ.50 వేల సంపాదిస్తున్నారని చెప్పారు. గ్రామాల్లోని అన్ని రకాల వయస్సు మహిళలతో సంఘాలను ఏర్పాటు చేసుకునేందుకు గ్రామ, మండల సంఘాలు పని చేయాలని సూచించారు. కార్యక్రమంలో డీపీఎం లాలు, ఏపీఎం దుర్గాప్రసాద్, ఎంపీడీఓ చిన్నారెడ్డి, సీసీలు స్వామి, అంజ్య, స్వేత సిబ్బంది పాల్గొన్నారు.
సమైక్య సంఘాలను బలోపేతం చేయాలి
తూప్రాన్: గ్రామాల్లో సమైక్య సంఘాలను బలోపేతం చేయాలని డీఆర్డీఏ అసిస్టెంట్ పీడీ సరస్వతి పేర్కొన్నారు. మంగళవారం మండలం మహిళా సమైక్య 21వ వార్షిక మహాసభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సంఘాలు లేని వారిని సంఘంలో చేర్చుట, వృద్ధుల సంఘాలు, వికలాంగుల సంఘాలు, కిశోర బాలికల సంఘాలు ప్రతి గ్రామంలో ఏర్పాటు చేయాలని సూచించారు. ఆర్థికంగా ప్రతి మహిళ అభివృద్ధి చెందేలా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను వివరించారు. ఆ దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం వెంకటేశ్వర్లు, మండల సమైక్య అధ్యక్షురాలు రోజా, కోశాధికారి నర్మదా పాల్గొన్నారు.
డీఆర్డీఏ అసిస్టెంట్ పీడీ సరస్వతి ఆదేశం