
ఉమ్మడి జిల్లాలో 74 అంబులెన్సులు
ప్రోగ్రాం మేనేజర్ షేక్ జాన్ షాహిద్
మెదక్ మున్సిపాలిటీ: జీవీకే ఈఎంఆర్‌ఐ గ్రీన్ హెల్త్ సర్వీసెస్ ఆధ్వర్యంలో ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా 74 అంబులెన్స్‌లు (108 వాహనాలు) సేవలందిస్తున్నట్లు ప్రోగ్రాం మేనేజర్ షేక్ జాన్ షాహిద్ తెలిపారు. మొత్తం 170 మంది సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారని చెప్పారు. వీరికి ఆరు నెలలకోసారి శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. దీంతో వైద్య పద్ధతులపై శిక్షణ, మెలకువలు మాతా శిశు మరణాల రేటును తగ్గుతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో మెదక్ జిల్లాలో మంజేర్ కిరణ్ కుమార్ పాల్గొన్నారు.
సంగారెడ్డి టౌన్: మద్యం దుకాణాల టెండర్లలో కల్లు గీత కార్మికులకు 25% కేటాయించాలని ఆ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఆశన్నగౌడ్ డిమాండ్ చేశారు. సంగారెడ్డి పట్టణంలో కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. మద్యం దుకాణాల టెండర్ల వల్ల గీత కార్మికుల ఉపాధి కోల్పోతున్నారని 15% రిజర్వేషన్ జీవో నంబర్ 93ను సవరించి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం 25% పెంచి కల్లుగీత సొసైటీలకు అందజేయాలని కోరారు.