రోడ్డు భద్రత.. జీవితానికి రక్షణ | - | Sakshi
Sakshi News home page

రోడ్డు భద్రత.. జీవితానికి రక్షణ

May 30 2025 7:01 AM | Updated on May 30 2025 7:01 AM

రోడ్డ

రోడ్డు భద్రత.. జీవితానికి రక్షణ

కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌, ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి
ఐదు రోజుల్లో కొనుగోళ్లు పూర్తి
నర్సాపూర్‌ ఆర్డీఓ మహిపాల్‌
నెల రోజులైనా ధాన్యం కొనరా?

మెదక్‌ కలెక్టరేట్‌: రోడ్డు భద్రతను మెరుగుపరిచి ప్రజల ప్రాణాలను కాపాడవచ్చునని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డితో కలిసి జిల్లాలోని వివిధశాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ముందుగా రహదారి భద్రత, ప్రమాదాలు జరిగే బ్లాక్‌ స్పాట్స్‌, నేషనల్‌ హైవే ద్వారా చేపట్టే ప్రణాళికలను చర్చించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి తీసుకోవాల్సిన చర్యలను పక్కా ప్రణాళికతో క్షేత్రస్థాయిలో అమలు చేయాలన్నారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. రోడ్డు భద్రతా నియమాలను కఠినంగా అమలు చేస్తున్నామని తెలిపారు. ఎప్పటికప్పుడు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. అనంతరం జిల్లాస్థాయి యాంటీ డ్రగ్‌ కమిటీ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. విద్యార్థులు, యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, చదువుపైనే దృష్టి సారించాలన్నారు. మాదక ద్రవ్యాల విని యోగం లేకుండా పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. నిరంతర తనిఖీలు నిర్వహించి గంజాయి, మత్తు పదార్థాల రవాణాను అరికడుతున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఆర్‌అండ్‌బీ ఈఈ సర్దార్‌సింగ్‌, జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీఎంహెచ్‌ఓ శ్రీరాం, మెదక్‌ డీఎస్పీ ప్రసన్న కుమార్‌, నేషనల్‌ హైవే, పోలీస్‌, రెవెన్యూ, రవాణా, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

చిలప్‌చెడ్‌(నర్సాపూర్‌): మరో ఐదు రోజుల్లో మండలంలో ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేస్తామని నర్సాపూర్‌ ఆర్డీఓ మహిపాల్‌ అన్నా రు. గురువారం చిలప్‌చెడ్‌ రెవెన్యూ కార్యాలయంలో భూభారతి దరఖాస్తులను పరిశీలించడంతో పాటు చిట్కుల్‌లో కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతులతో మాట్లాడారు. భూభారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన సమస్యలను రెండు బృందాలు పరిష్కరిస్తున్నాయని తెలిపారు. రైతులు దిగులు చెందాల్సిన అవసరం లేదని, లారీల కొరత లేకుండా చేసి మరో ఐదు రోజుల్లో పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేస్తామన్నారు. రైతులు తేమశాతం తక్కువ ఉండేలా చూసుకుంటూ కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు సహకరించాలని సూచించారు. ఆయన వెంట తహసీల్దార్‌ సహదేవ్‌, డిప్యూటీ తహసీల్దార్‌ సింధూజ, రెవెన్యూ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

గడిపెద్దాపూర్‌ రైతుల ఆందోళన

అల్లాదుర్గం(మెదక్‌): ధాన్యం కొనుగోలు చేయాలంటూ అన్నదాతలు ఆందోళనకు దిగారు. నెలరోజులుగా ధాన్యం బస్తాల వద్ద కాపలా ఉండాల్సి వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ గురువారం గడిపెద్దాపూర్‌ 161 జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ధాన్యం తూకం వేసినా తామే కాపలా ఉంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడడంతో విషయం తెలుసుకున్న సీఐ రేణుకారెడ్డి, తహసీల్దార్‌ మల్లయ్య సంఘటన స్థలికి చేరుకొని రైతులకు నచ్చజెప్పి అందోళన విరమింపజేశారు. ఇదిలాఉండగా అల్లాదుర్గం, గడిపెద్దాపూర్‌ కొనుగోలు కేంద్రాలను డీఎస్‌ఓ సురేశ్‌రెడ్డి, సివిల్‌ సప్లై మేనేజర్‌ జగదీశ్వర్‌ తనిఖీ చేశారు. రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తామని, రెండు రోజుల్లో తూకం వేసిన ధాన్యం తరలిస్తామని చెప్పారు. గడిపెద్దాపూర్‌లో రెండు లారీల ధాన్యం వెంటనే తరలిస్తున్నట్లు తెలిపారు. వర్షాలతో మ్యాచర్‌ రాక మిల్లర్లు కొనడం లేదని అన్నారు.

రోడ్డు భద్రత.. జీవితానికి రక్షణ 1
1/2

రోడ్డు భద్రత.. జీవితానికి రక్షణ

రోడ్డు భద్రత.. జీవితానికి రక్షణ 2
2/2

రోడ్డు భద్రత.. జీవితానికి రక్షణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement