సీజనల్ వ్యాధులపై ప్రత్యేక దృష్టి
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని మున్సిపల్ ప్రత్యేక అధికారిణి, మెదక్ ఆర్డీవో రమాదేవి ఆదేశించారు. మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. వర్షాకాలం సమీపిస్తుండటంతో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. దీంతో పారిశుద్ధ్య కార్యక్రమం పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. తడి, పొడి చెత్త సేకరణతోపాటు పట్టణంలోని ఇళ్లలో పాత టైర్లు, కూలర్లు, ఇతర ప్రదేశాల్లో నీరు నిల్వ లేకుండా చూడాలన్నారు. నీరు నిలిస్తే దోమలు వ్యాప్తి చెందుతాయని పేర్కొన్నారు. ప్రతి వారం అన్ని వార్డుల్లో ఫాగింగ్ చేయాలని, మురుగు కాలువలు శుభ్రపర్చాలని ఆమె ఆదేశించారు. పారిశుద్ద్య కార్యక్రమాలకు సంబంధించి ప్రతి రోజూ వివరాలు రిజిస్టర్‌లో నమోదు చేయాలన్నారు. చెత్త సేకరణ సక్రమంగా కొనసాగాలని ఆర్డీవో ఆదేశించారు.


