నిబంధనల పట్టింపు ఏది?
రాయికోడ్(అందోల్): జాతీయ ఉపాధి హామీ పథకం పనులపై నిబంధనల పట్టింపులేకుండా వ్యవహరించడమేమిటని కేంద్ర తనిఖీ బృందం పంచాయతీ రాజ్ శాఖ అధికారులను నిలదీశారు. దీంతో సంబంధిత అధికారులు సమాధానం చెప్పలేక నీళ్లునమిలారు. జాతీయ ఉపాధి హామీ పథకం నిధులతో నిర్వహించిన పనులను తనిఖీ చేసేందుకు ఆదివారం రాయికోడ్‌కు గ్రామీణాభివృద్ధి శాఖ జాతీయ అధికారులు సంజయ్‌కుమార్ తదితరులు వచ్చారు. గ్రామంలోని ఉన్నత పాఠశాలలో నిర్మించిన టాయిలెట్స్, వంట గది, ప్రహరీలను, పలు మెటల్, ఫార్మేషన్ రోడ్లను పరిశీలించారు. ఎక్కడా నిబంధనలు పాటించకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర బృందం పర్యటిస్తుంటే రాష్ట్ర, జిల్లా అధికారులు పీఆర్‌డీఈ తదితరులు హాజరు కాకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. ఈజీఎస్ నిధుల వినియోగంలో కనీస నిబంధనలు పాటించకపోవడంపై వివరాలు నమో దు చేసుకున్నారు. నివేదికను తమ శాఖకు నివేదించనున్నట్లు తెలిపారు.
ఉపాధి పనులపై కేంద్రం బృందం నిలదీత


