సిందూర్‌ను విమర్శించేవారు మూర్ఖులు
మెదక్‌జోన్: ఆపరేషన్ సిందూర్‌ను విమర్శించే మూర్ఖులకు ప్రజలే బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. పహల్గాం ఉగ్రదాడిని నిరసిస్తూ మంగళవారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశంగౌడ్ ఆధ్వర్యంలో పట్టణంలోని గుల్షన్ క్లబ్ నుంచి రాందాస్ చౌరస్తా వరకు త్రివర్ణ జెండాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ హాజరై మాట్లాడారు. హిందువులను టార్గెట్ చేస్తూ భర్తలను చంపి వారి భార్యల నొదుట సిందూరం తుడిచిన ముష్కరులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన సమాధానమే ఆపరేషన్ సిందూర్ అని పేర్కొన్నారు. భారతదేశం ఎవరిపై ఆధారపడకుండా స్వశక్తితో ప్రపంచానికి మన సైన్యం సత్తా ఏంటో సిందూర్ ద్వారా చూపించిందన్నారు.
ఎంపీ రఘునందన్‌రావు


