అభ్యుదయ వాది బసవేశ్వరుడు
అదనపు కలెక్టర్ నగేష్
మెదక్ కలెక్టరేట్: అభ్యుదయవాది అయిన బసవేశ్వరుడి ఆశయాలతోనే సమాజంలో మార్పు వస్తోందని అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో బసవేశ్వర జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సా మాజిక, ఆర్థిక, సాంస్కృతిక మార్పులకు శ్రీకారం చుట్టిన గొప్ప సంస్కర్త బసవేశ్వరుడని కొనియాడారు. ఆయన బోధించిన అభ్యుదయవాద సాంప్రదాయమే నేడు లింగాయత్ ధర్మంగా మారిందన్నారు. కార్యక్రమంలో బసవ లింగాయత్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
అగ్నివీర్‌కు ఆన్‌లైన్ దరఖాస్తులు
భారతీయ వైమానిక దళంలో చేరడానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఉద్యోగ అవకాశాలను అందిస్తుందని అదనపు కలెక్టర్ నగేష్ తెలిపారు. జిల్లాలోని ఆర్హత, ఆసక్తిగల యువతీ, యువకులు ఈనెల 11వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. పూర్తి సమాచారం కోసం 040– 27758212 నంబర్‌లో సంప్రదించాలన్నారు. కా ర్యక్రమంలో డీఈఓ రాధాకిషన్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం యాసంగి పంట కొనుగోళ్లపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ పాల్గొన్నారు.


