పాఠశాల నిర్వహణ ఇలాగేనా? | - | Sakshi
Sakshi News home page

పాఠశాల నిర్వహణ ఇలాగేనా?

Mar 13 2025 2:36 PM | Updated on Mar 13 2025 2:35 PM

మెదక్‌జోన్‌: ‘పాఠశాల నిర్వహణ ఇలానే ఉంటుందా..? బాలికలు ఉపయోగించే మరుగుదొడ్లు అధ్వాన్నంగా ఉన్నాయి. కనీసం తలుపులు లేకపోవటం బాలల హక్కులను హరించటమే అవుతుంది’ అని సీనియర్‌ సివిల్‌ జడ్జి జితేందర్‌ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం పట్టణంలోని వెస్లీ ఉన్నత పాఠశాలను ఎంఈఓ నీలకఠంతో కలిసి తనిఖీ చేశారు. పాఠశాల చుట్టూ అపరిశుభ్ర వాతావరణం ఉండడంపై మండిపడ్డారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని, లేకపోతే శాఖాపరమై నా చర్యలు తప్పవని ఎంఈఓ హెచ్చరించారు.

విద్యార్థులకు

నాణ్యమైన భోజనం పెట్టాలి

కౌడిపల్లి(నర్సాపూర్‌): పాఠశాలలకు ప్రభు త్వం పంపిణీ చేసిన వంట సామగ్రిని వినియోగించుకోవాలని జిల్లా సివిల్‌ సప్లై అధికారి సురేష్‌రెడ్డి సూచించారు. బుధవారం మండలంలోని వెంకట్రావుపేట, రాయిలాపూర్‌, తాళ్లగడ్డతండా పాఠశాలలను ఎంఈఓ బాలరాజుతో కలిసి తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం పాఠశాలల్లో మ ధ్యాహ్న భోజనం తయారుచేసేందుకు ఇటీవల సామగ్రిని పంపిణీ చేసిందన్నారు. వాటిని వినియోగించి పరిశుభ్రత పాటించాలని సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం వండిపెట్టాలన్నారు. అనంతరం మధ్యాహ్న భోజనం, బియ్యం పరిశీలించారు. కార్యక్రమంలో ఆయా పాఠశాలల హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

గ్రూప్‌– 2లో

మెరిసిన అర్జున్‌రెడ్డి

పాపన్నపేట(మెదక్‌): మండల కేంద్రమైన పాపన్నపేటకు చెందిన అర్జున్‌రెడ్డి గ్రూప్‌–2 పరీక్షలో స్టేట్‌ 18వ ర్యాంకు సాధించి సత్తా చాటాడు. హవేళిఘనాపూర్‌ మండల రెవెన్యూ కార్యాలయంలో సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న అర్జున్‌రెడ్డి గ్రూప్‌–2లో 413.890 మార్కులు సాధించాడు. అతని తండ్రి నరేందర్‌రెడ్డి మెదక్‌లో లైబ్రేరియన్‌గా, తమ్ముడు అరుణ్‌రెడ్డి ఆర్‌అండ్‌బీలో ఏఈగా, బాబాయి శ్రీనివాస్‌రెడ్డి హెడ్‌ కానిస్టేబుల్‌గా పనిచేసున్నారు. కుటుంబ సభ్యులందరూ ప్రభుత్వ ఉద్యోగులు కావడం విశేషం. గ్రూప్‌–1 కొలువు కొట్టడమే తన లక్ష్యమని పేర్కొన్నాడు.

మోతాదుకు మించి ఎరువులు వాడొద్దు

పాపన్నపేట(మెదక్‌): రైతులు ఆధునిక సాగుకు సిద్ధం కావాలని జిల్లా వ్యవసాయ అధికారి వినయ్‌ పిలుపునిచ్చారు. బుధవారం మండల పరిధిలోని పాపన్నపేట, చిత్రియాల్‌ డీసీఎంఎస్‌ ఎరువుల దుకాణాల్లో రికార్డులు తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడు తూ.. అవసరానికి అనుగుణంగా వ్యవసాయ అధికారుల సలహా మేరకు ఎరువులు వాడా లని సూచించారు. దుకాణాదారులు నాణ్యమైన ఎరువులు విక్రయించాలని ఆదేశించారు. నిబంధనలకు అనుగుణంగా వ్యాపారం చేయాలన్నారు. రైతులకు ఏ సమస్యలు వచ్చినా అధికారులను సంప్రదించాలని తెలిపారు. ఆయన వెంట పాపన్నపేట మండల వ్యవసాయ అధికారి నాగమాధురి ఉన్నారు.

డీసీసీబీ చైర్మన్‌కు పితృ వియోగం

కొండపాక(గజ్వేల్‌): ఉమ్మడి మెదక్‌ జిల్లా డీసీసీబీ చైర్మన్‌ చిట్టి దేవేందర్‌రెడ్డి తండ్రి రాంరెడ్డి(80) హైదరాబాద్‌లో మృతి చెందారు. స్వగ్రామమైన కొండపాకలో బుధవారం అంత్యక్రియలు నిర్వహించారు. డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి, ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి, అధికారులు, మాజీ ప్రజా ప్రతినిధులు డీసీసీబీ చైర్మన్‌ను పరామర్శించారు.

పాఠశాల నిర్వహణ ఇలాగేనా? 
1
1/2

పాఠశాల నిర్వహణ ఇలాగేనా?

పాఠశాల నిర్వహణ ఇలాగేనా? 
2
2/2

పాఠశాల నిర్వహణ ఇలాగేనా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement