గది తలుపులు తీయగా.. కుళ్లిన స్థితిలో మహిళ మృతదేహం! ఒక్క‌సారిగా.. | Sakshi
Sakshi News home page

గది తలుపులు తీయగా.. కుళ్లిన స్థితిలో మహిళ మృతదేహం! ఒక్క‌సారిగా..

Published Thu, Nov 23 2023 4:36 AM

- - Sakshi

మెదక్‌: పరిశ్రమలో పని చేయడానికి వచ్చిన మహిళ హత్యకు గురైంది. ఈ సంఘటన మనోహరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ కరుణాకర్‌రెడ్డి కథనం ప్రకారం.. కాళ్లకల్‌ గ్రామ శివారులో సర్వేనంబర్‌ 86లో గల గీతా ప్యానల్‌ ప్రొడక్ట్‌ పరిశ్రమ ఉంది. కాగా రెండేళ్ల క్రితం సూరజ్‌, రజనీదేవి చౌహాన్‌ (40) పరిశ్రమలో పని కోసం వచ్చారు. వారికి పని ఇచ్చి పరిశ్రమలోనే లేబర్‌ గదిని కేటాయించినట్లు పరిశ్రమ యజమాని ప్రవీణ్‌ పటేల్‌ తెలిపారు. కాగా ఈ నెల 19న సూరజ్‌ గదికి తాళం వేసి వెళ్లిపోయాడు.

కాగా బుధవారం గదిలో నుంచి దుర్వాసన రావడంతో కార్మికులు యజయాని ప్రవీణ్‌ పటేల్‌కు సమాచార మిచ్చారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు పరిశ్రమ వద్దకు వచ్చి గది తలుపులు తీయగా కుళ్లిన స్థితిలో రజనీదేవి మృతదేహం కనిపించింది. దీంతో ఈమెను సూరజ్‌ హత్య చేసి వెళ్లినట్లు అనుమానం వ్యక్తం చేశారు. కేసు దర్యాప్తులో ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

Advertisement
Advertisement