ఆఖరి బిల్లు | - | Sakshi
Sakshi News home page

ఆఖరి బిల్లు

Jul 24 2026 7:19 AM | Updated on Jul 24 2026 7:19 AM

శుక్రవారం శ్రీ 24 శ్రీ జూలై శ్రీ 2026 ఆఖరి బిల్లు మెదక్‌జోన్‌: జిల్లాకు గతేడాది మొదటి విడతలో 8,915 ఇళ్లు మంజూరయ్యాయి. ఇందులో పునాదుల వరకు నిర్మించిన ఇళ్లు 1,616 కాగా, గుంతలు తీసినవి 1,057, బెస్‌మెంట్‌ లెవల్‌ వరకు 1,320 పూర్తి కాగా, గోడలు పూర్తయినవి 662, స్లాబ్‌వరకు 2,366, నిర్మాణాలు పూర్తయినవి 1,900 ఇళ్లు ఉన్నాయి. ఇందుకు సంబంధించి రూ.228 కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నాలుగు విడతల్లో బిల్లులు ఇస్తుండ గా, ఆఖరు బిల్లులు మాత్రం రావడం లేదని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం 600 చదరపు అడుగుల వరకు ఇళ్లు నిర్మించుకునే వెసులుబాటు ఇవ్వటంలో ఇద్దరు పిల్లలున్న లబ్ధిదారులు అప్పు చేసి నిర్మాణాలు చేపట్టారు. అయితే ఇళ్లు నిర్మించి 6 నెలలు గడుస్తున్నా బిల్లుల చెల్లింపుల్లో జాప్యం జరుగుతుందని వాపోతున్నారు. ఇందిరమ్మ పథకంలో భాగంగా ప్రభుత్వం రూ. 5 లక్షలు ఇస్తుందనే ధీమాతో ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించిన లబ్ధిదారులకు అమెరికా–ఇరాన్‌ యుద్ధంతో సిమెంట్‌, స్టీలు ధరలు పెరిగి ఇబ్బందులు పడ్డారు. ఇంటి నిర్మాణం చేపట్టిన వారికి నాలుగు విడతల్లో బిల్లులు ఇవ్వాల్సి ఉంది. అందులో మొదటిది బెస్‌మెంట్‌ పూర్తి చేస్తే రూ. లక్ష, గోడల వరకు రూ. మరో లక్ష, స్లాబుకు రూ. 1.40 లక్షలు, మరుగుదొడ్డికి రూ.12 వేలు, ఉపాధి పథకంలో పునాది గుంతలు తీసినందుకు రూ.28 వేలు అందజేస్తున్నారు. అయితే స్లాబు పూర్తిచేసి కలర్లు వేశాక ఆఖరి బిల్లు రూ.1.20 లక్షలు చెల్లించాలి. అయితే రాష్ట్ర ప్రభుత్వం 3 విడతల్లో రూ. 3.40 లక్షలు లబ్ధిదారులకు ఇస్తుండగా, కేంద్ర ప్రభుత్వం ప్రధాని ఆవాస్‌ యోజన పథకంలో భాగంగా ప్రతి ఇంటికి రూ. 1.60 లక్షలు ఇస్తోంది.

న్యూస్‌రీల్‌

‘ఇందిరమ్మ’ లబ్ధిదారులకు తప్పని నిరీక్షణ జిల్లాలో రూ. 228 కోట్లు పెండింగ్‌ 1,900 ఇళ్ల నిర్మాణాలు పూర్తయి 6 నెలలు

రెండో విడతకు కసరత్తు

రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక జిల్లాలో జోరుగా సాగుతోంది. ఈ విడతలో ఇళ్లు లేని వారితో పాటు పూరి గుడిసెలో ఉన్న వారికి ప్రాధాన్యం ఇస్తున్నారు. జిల్లావ్యాప్తంగా పూరి గుడిసెల్లో ఉంటున్న వారు 2,753 మందిని గుర్తించారు. అయితే మెదటి విడతలో ఇళ్లు నిర్మించుకున్న వారికే పూర్తిస్థాయిలో బిల్లులు రాకపోవడంతో లబ్ధిదారులు ఇంటి నిర్మాణానికి జంకుతున్నారు.

జంగరాయిలో నిర్మాణం పూర్తయిన ఇల్లు

శుక్రవారం శ్రీ 24 శ్రీ జూలై శ్రీ 2026

పెరిగిన నిర్మాణ వ్యయం

మూణ్నాళ్ల ముచ్చటేనా!

ఆందోళన వద్దు

ఇందిరమ్మ పథకంలో ఇళ్లు నిర్మించుకున్న వారికి ఆఖరు బిల్లులు రాలేదు. ఈ విషయమై ప్రభుత్వానికి రాసి పంపించాం. మంజూరు కాగానే లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తాం. బిల్లులు రాలేదని ఎవరూ ఆందోళన పడొద్దు. ఇళ్లు లేని నిరుపేదలకు ఈ పథకం ఆర్థికంగా ఆదుకుంటుంది. ఇప్పటి వరకు ఇంటి నిర్మాణం మొదలు పెట్టని వారు వెంటనే ప్రారంభించాలి.

– మాణిక్యం, హౌసింగ్‌ పీడీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement