రీ సర్వేతో భూ సమస్యల పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

రీ సర్వేతో భూ సమస్యల పరిష్కారం

Jul 24 2026 7:19 AM | Updated on Jul 24 2026 7:19 AM

హవేళిఘణాపూర్‌(మెదక్‌)/చిన్నశంకరంపేట: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూముల రీ సర్వేతో సమస్యలు పరిష్కారమవుతాయని కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ అన్నారు. గురువారం మెదక్‌ మండలం కోంటూర్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కలెక్టర్‌ హాజరై మాట్లాడారు. రీ సర్వే ద్వారా ఏళ్ల తరబడి సాగుతున్న సమస్యలన్నింటికీ పరిష్కారం లభించి రైతులకు న్యాయం జరుగుతుందన్నారు. రికార్డులు, మోకా, పట్టాదారుల వివరాలు ఇతర అంశాలను పరిగణలోకి తీసుకొని ప్రభుత్వ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామానికి సంబంధించిన భూములు కూడా స్పష్టత వస్తుందని, ప్రభుత్వ భూములను కూడా గుర్తించేందుకు వీలుందన్నారు. ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ యాదగిరి, అదనపు కలెక్టర్‌ నగేశ్‌, ఆర్డీఓ రమాదేవి, ల్యాండ్‌ సర్వే ఏడీ కిషన్‌, గ్రామ రైతులు పాల్గొన్నారు. అనంతరం చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర హాస్టల్‌ను కలెక్టర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని సిబ్బందని ఆదేశించారు.

జిల్లాలో 86శాతం సర్‌ పూర్తి

నర్సాపూర్‌: ఓటరు జాబితా సవరణలో పారదర్శకతకు ప్రాధాన్యం ఇవ్వాలని, జిల్లాలో ఇప్పటివరకు ప్రత్యేక ఓటరు జాబితా సవరణ 86 శాతం పూర్తయినట్లు కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ చెప్పారు. గురువారం ఆర్‌డీఓ కార్యాలయంలో తహసీల్దార్లు, బీఎల్‌ఓలు, సూపర్‌వైజర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఓటర్ల వివరాల్లో ఉన్న వ్యత్యాసాలు, లోపాలు తగ్గించేందుకు క్షుణ్ణంగా పరిశీలించి సరిదిద్దాలని ఆదేశాలు జారీ చేశారు.

కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement