సైబర్‌ నేరాలపై పటిష్ట నిఘా | - | Sakshi
Sakshi News home page

సైబర్‌ నేరాలపై పటిష్ట నిఘా

Jul 24 2026 7:19 AM | Updated on Jul 24 2026 7:19 AM

మెదక్‌జోన్‌: సైబర్‌ నేరాలపై పటిష్ట నిఘా పెట్టామని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు తెలిపారు. గురువారం హైదరాబాద్‌ నుంచి డీజీపీ సీవీ ఆనంద్‌ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈసందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. గతంలో పోలీసులు నక్సలిజం వంటి అనేక సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారని, ప్రస్తుతం సైబర్‌ నేరాలు, డ్రగ్స్‌ వినియోగం, ఆహార పదార్థాల కల్తీ, రోడ్డు ప్రమాదాలు ప్రధాన సవాళ్లుగా మారాయని, వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవాలని ఆదేశించారు. ఈసందర్భంగా ఎస్పీ మా ట్లాడుతూ.. ప్రతి పోలీస్‌స్టేషన్‌లో సైబర్‌ వారియర్స్‌ను అందుబాటులో ఉంచి, ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తున్నట్లు వివరించారు. ప్రజలను మోసాలకు గురిచేసి ఆర్థికంగా నష్టపరిచే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సమావేశంలో అదనపు ఎస్పీ విక్రమ్‌ కుమార్‌ సింగ్‌, సైబర్‌ క్రైమ్‌ డీఎస్పీ సుభాష్‌ చంద్రబోస్‌, సీఐలు రాజశేఖర్‌ రెడ్డి, జార్జ్‌, సైబర్‌ క్రైమ్‌, ఐటీ కోర్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఎస్పీ డీవీ శ్రీనివాసరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement