ఎమ్మెల్యే సంజీవరెడ్డి
నారాయణఖేడ్: నియోజకవర్గ పరిధిలోని రోడ్లు భవనాల శాఖకు సంబంధించిన నాలుగు ప్రధాన రోడ్ల అభివృద్ధికి రూ.136.97 కోట్లు మంజూరయ్యాయని ఎమ్మె ల్యే సంజీవరెడ్డి తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. ఖేడ్–రాయిపల్లి రోడ్డు 10 కి.మీ మేర అభివృద్ధికి రూ.11.58 కోట్లు, ఖేడ్–మాసాన్‌పల్లి రోడ్డు 22.40 కి.మీకు గాను రూ. 60.57 కోట్లు, ఖేడ్– పెద్దశంకరంపేట రోడ్డు 14.20 కి.మీకు గాను రూ. 39 కోట్లు, ఖేడ్– కరస్ గుత్తి రోడ్డు 22.30 కి. మీల మేర అభివృద్ధికి రూ. 25.82 కోట్లు మంజూరైనట్లు వివరించారు. గత ప్రభుత్వం రోడ్ల గురించి ఏమాత్రం పట్టించుకోకపోవడం వల్లే దెబ్బతిన్నాయని విమర్శించారు. ఆయా రోడ్ల అభివృద్ధి పనులు త్వరితగతిన ప్రారంభిస్తామని వెల్లడించారు.
నేడు విద్యుత్ సరఫరాలో
27న గురుకులాల్లో
స్పాట్ అడ్మిషన్లు
చేగుంట(తూప్రాన్): మెదక్‌తో పాటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని గిరిజన గురుకులాల్లో ఈనెల 27న స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు గిరిజన గురకులాల రీజినల్ కోఆర్డినేటర్ గంగారాం నాయక్ తెలిపారు. 5 నుంచి 9 తరగతులతో పాటు ఇంటర్ మొదటి సంవత్సరం సీట్లు ఖాళీగా ఉన్నాయన్నారు. జిల్లాలో నర్సాపూర్ జూనియర్ కళాశాల, కౌడిపల్లి పాఠశాల, జూనియర్ కాలేజీల్లో చేరేందుకు కౌడిపల్లిలోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల్లో స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తామన్నారు. ఉమ్మడి నిజామాబాద్‌కు చెందిన నాగిరెడ్డిపేట, బాన్సువాడ, చీమన్‌పల్లి బాలుర గురుకులాల్లో ఖాళీ సీట్ల భర్తీ కోసం కామారెడ్డి పట్టణం సరంపల్లి గిరిజన గురకులంలో స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తామని వివరించారు.
ఇంకుడు గుంతలు తప్పనిసరి
హత్నూర(సంగారెడ్డి): భూగర్భజలాలు పెంపొందించేందుకు ప్రతి ఇంటిలో ఇంకుడు గుంత ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని డీఆర్డీఓ పీడీ జ్యోతి అన్నారు. గురువారం హత్నూర రైతు వేదికలో సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులతో జలసిరి కార్యక్రమంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో వర్షాలు తక్కువగా ఉన్నందున అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో ప్రతి ఇంటికి ఇంకుడు గుంత ఉండేలా కృషి చేయాలన్నారు. పొలాల్లో సైతం నీటి గుంతలను ఏర్పాటు చేసుకోవాలని రైతులను కోరారు. కార్యక్రమంలో ఏపీడి మధులత, ఎంపీడీఓ శంకర్, ఎంపీఈఓ యూసుఫ్, ఏపీఓ ప్రవీణ్, ఏపీఎం రాజశేఖర్, సిబ్బంది పాల్గొన్నారు.


