నేరాల నియంత్రణలో నిర్లక్ష్యం వహించొద్దు | - | Sakshi
Sakshi News home page

నేరాల నియంత్రణలో నిర్లక్ష్యం వహించొద్దు

Nov 20 2026 1:01 AM | Updated on Nov 20 2026 1:01 AM

● విధుల్లో అప్రమత్తంగా ఉండాలి ● మంచిర్యాల డీసీపీ ఏ.భాస్కర్‌

● విధుల్లో అప్రమత్తంగా ఉండాలి ● మంచిర్యాల డీసీపీ ఏ.భాస్కర్‌

కాసిపేట: పోలీసులు విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని, నేరాల నియంత్రణలో నిర్లక్ష్యం వహించొద్దని మంచిర్యాల డీసీపీ ఏ.భాస్కర్‌ సూచించారు. గురువారం దేవాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆన్‌లైన్‌లో కేసుల నమోదు, దర్యాప్తులో ఉన్న కేసులు, ఈ–సమన్ల అమలు, పెండింగ్‌ కేసుల పురోగతిపై ఎస్సై గంగారాంను అడిగి తెలుసుకున్నారు. డీసీపీ మాట్లాడుతూ రౌడీషీటర్లు, సస్పెక్ట్‌ షీట్‌ కలిగిన వ్యక్తులు, ఇతర నేర చరిత్ర ఉన్న వ్యక్తుల ఇళ్లను క్రమం తనిఖీ చేస్తూ కదలికలపై నిఘా ఉంచాలని ఆదేశించారు. ప్రజలు, వ్యాపారులకు సీసీ కెమెరాల ఏర్పాటుపై అవగాహన కల్పించి, నేరాల నివారణలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement