దండేపల్లి: మండలంలోని నర్సాపూర్ శివారులో చివరి ఆయకట్టుకు సాగునీరందక పంటలు ఎండిపోయాయి. దీంతో రైతులు ఇటీవల ఎండిన పంటలకు నిప్పుపెట్టి నిరసన తెలిపిన విషయం తెలిసిందే. ఎండిన పంట పొలాలను బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు విజిత్‌రావు గురువారం పరిశీలించారు. ఇక్కడి పరిస్థితిని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఫోన్లో వివరిస్తూ బాధిత రైతుతో మాట్లాడించారు. రైతు తిరుపతితో కేటీఆర్ మాట్లాడి సాగునీటి కష్టాలను తెలుసుకున్నారు. ‘ధైర్యం కోల్పోకండి.. ఒక సంవత్సరం ఓపిక పట్టండి.. వచ్చేది మన ప్రభుత్వమే.. ఎవరూ అధైర్య పడకండి..’ అని భరోసా కల్పిస్తూ ఓదార్చారు. మాజీ వైస్‌ఎంపీపీ అనిల్, మాజీ పీఏసీఎస్ చైర్మన్ లింగన్న, మాజీ ఉపసర్పంచ్ లక్ష్మణ్, నాయకులు అజయ్, సంతోష్ పాల్గొన్నారు.


