మంచిర్యాలఅగ్రికల్చర్: సోలార్ విద్యుత్‌పై మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లోని 40 మంది ఇంజనీర్లకు జిల్లా కేంద్రంలోని ఎస్‌ఈ కార్యాలయంలో గురువారం శిక్షణ తరగతులు నిర్వహించారు. ప్రొజెక్టర్ ద్వారా ఫ్యాకల్టీలు నాగేశ్వర్‌రావు, వంశీకృష్ణ గృహ విద్యుత్ సోలార్ విద్యుత్ వినియోగం, పలకల ఏర్పాటు తదితర అంశాలపై శిక్షణ ఇచ్చారు. అనంతరం సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యుత్ శాఖ ఎస్‌ఈ రాజన్న, డీఈలు ఖైసర్, దుర్గం మల్లేష్, ఏడీఈలు మోహన్‌రెడ్డి, వేణుగోపాల్, రాజశేఖర్, తిరుపతి, బాలకృష్ణ, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.


