మంచిర్యాలఅగ్రికల్చర్: ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మక సామాజిక భద్రత పథకం, ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలుకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పథకం అమలు, కార్యాచరణపై కలెక్టర్, అదనపు కలెక్టర్, అధికారులతో సమీక్ష నిర్వహించారు. విక్రమార్క మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని కుటుంబాల్లో కుటుంబ పెద్దకు ఈ పథకం వర్తించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అన్నారు. ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు ఆ కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించడ మే ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఈ నెల 19న ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా పథకాన్ని అధి కారికంగా ప్రారంభిస్తామని అన్నారు. అదే రోజు నుంచి దరఖాస్తుల పంపిణీ, వివరాల సేకరణ పూర్తి చేయాలని చెప్పారు. కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలుకు జిల్లాలో అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్, జిల్లా ప్రణాళిక అధికారి పాప య్య, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి గణపతి, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.


