● మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాసరావు
మంచిర్యాలటౌన్: బాల్య వివాహాల నిర్మూలనకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పని చేస్తూ ప్రజల్లో అవగాహన కల్పించాలని మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారి రౌఫ్‌ఖాన్‌తో కలిసి బాల్య వివాహ ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా రెవెన్యూ, మహిళా, శిశు సంక్షేమ, పోలీస్ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ బాల్య వివాహాల వల్ల బాలికలు అనారోగ్య సమస్యలకు గురయ్యే ప్రమాదం ఉందని, మానసిక పరిపక్వత పెరగకపోవడంతోపాటు జీవితంపై సరైన అవగాహన ఏర్పడకుండా వారి భవిష్యత్ దెబ్బతింటుందని తెలిపారు. బాల్య వివాహ ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 5 నుంచి 16వరకు పాఠశాలల్లో, 17నుంచి 26వరకు ప్రార్థన మందిరాలు, ఫంక్షన్ హాళ్లలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. 27న అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించి బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలు, వాటి నిర్మూలనపై ప్రజలకు అవగాహన కల్పిస్తామని అన్నారు. 28నుంచి డిసెంబర్ 21వరకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.


