తానూరు: మండల కేంద్రంలోని అడెల్లి పోచమ్మ ఆలయంలో గురువారం రాత్రి చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు హుండీని ధ్వసం చేసి అందులో ఉన్న నగదును అపహరించారు. శుక్రవారం ఉదయం పూజలకు భక్తులు వెళ్లగా హుండీ ధ్వసం చేసి కనిపించింది. ఆలయ నిర్వాహకులకు సమాచారం అందించారు. సభ్యులు ఆలయానికి చేరుకుని హుండీని పరిశీలించారు. పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై జుబేర్ సిబ్బందితో ఆలయానికి చేరుకుని ధ్వసం చేసిన హుండీని పరిశీలించారు. స్థానికుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. క్లూస్ టీమ్‌ను రప్పించి ఆధారాలు సేకరించారు. పూర్తి విరాలను సేకరించి దొంగలను పట్టుకుంటామని ఎస్సై వెల్లడించారు. హుండీలో సూమారు రూ.30 వేల వరకు నగదుతోపాటు 40 తులాల వెండి అభరణలు చోరీ అయినట్లు ఎస్సై, ఆలయ నిర్వాహకులు తెలిపారు.
మందమర్రిరూరల్: మందమర్రి మండలం వెంకటాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో శుక్రవారం పని స్థలం సమీపంలో కూలీ సిద్ధన్న లస్మక్క(65) ఆకస్మాత్తుగా మృతిచెందింది. తోటి కూలీలు తెలిపిన వివరాల ప్రకారం.. వీబీజీరామ్‌జీ పనుల అనంతరం అందరూ కలిసి భోజనాలు చేశారు. అకస్మాత్తుగా లస్మక్క ఒక్కసారిగా ముందుకు కుప్పకూలి పడిపోయింది. 108 అంబులెన్స్‌కు కాల్ చేసి ఆమెను తీసుకుని అటవీ ప్రాంతం నుంచి గ్రామ ప్రాంతం వైపు వచ్చారు. 108 సిబ్బంది ఎదురై లస్మక్కను పరిశీలించగా అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. మృతికి కారణాలు తెలియరాలేదు. ఆమెకు భర్త, నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.
మహాలక్ష్మి ఆలయంలో చోరీ