మంచిర్యాలఅర్బన్: తమిళనాడులోని ఎస్ఆర్ఎం(ఎస్ఆర్ఎం) విశ్వవిద్యాలయంలో వచ్చే నెల 17, 18, 19, 20వ తేదీల్లో జరిగే సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ క్రికెట్ పోటీలకు జిల్లాకు చెందిన ముగ్గురు విద్యార్థులు ఎంపికయ్యారు. ఈ నెల 12న కాకతీయ యూనివర్సిటీ(కేయూ)లో జరిగిన ఇంటర్ కాలేజియేట్ టోర్నమెంట్ కమ్ సెలక్షన్ పోటీల్లో వీరు ప్రతిభ కనబరిచి కేయూ జట్టులో స్థానం సాధించారు. మంచిర్యాల మిమ్స్ కళాశాలకు చెందిన బీకాం తృతీయ సంవత్సరం విద్యార్థి సిద్ధార్థ, సీవీ రామన్ కళాశాలకు చెందిన బీబీఏ ప్రథమ సంవత్సరం విద్యార్థి సింహాద్రి, బీకాం ప్రథమ సంవత్సరం విద్యార్థి అవేజ్ ఎంపికయ్యారని సెలక్షన్ కమిటీ సభ్యుడు, పీడీ నూనె శ్రీనివాస్, ప్రశాంత్ తెలిపారు. విద్యార్థుల ఎంపికపై మిమ్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఉపేందర్‌రెడ్డి, కరస్పాండెంట్ శ్రీనివాస్‌రాజు, శ్రీధర్‌రావు, సీవీ రామన్ కళాశాల డైరెక్టర్ నరసయ్య హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. సౌత్ జోన్ పోటీల్లోనూ రాణించి కాకతీయ యూనివర్సిటీకి బంగారు పతకం సాధించాలని, తద్వారా ఆలిండియా యూనివర్సిటీ పోటీలకు ఎంపిక కావాలని ఆకాంక్షించారు.
సిద్ధార్థ
సింహాద్రి, అవేజ్


