ఆసిఫాబాద్‌రూరల్: జిల్లా కేంద్రంలోని గిరిజన బాలిక ల సంక్షేమ గురుకుల పాఠశాలకు చెందిన ఆర్తి (10వ తరగతి) ఖేలో ఇండియా ఫుట్‌బాల్ కోచింగ్ క్యాంపున కు ఎంపికై నట్లు గిరిజన గు రుకుల డీసీవో అరుణ శ్రీ, హెచ్ఎం మహేశ్వరి శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా కోచ్ రవి మాట్లాడుతూ ఈ నెల 13 నుంచి 25వ తేది వరకు ఖేలో ఇండియా ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని గచ్చిబౌ లి స్టేడియంలో నిర్వహించే ఫుట్‌బాల్ కోచింగ్ క్యాంప్‌లో పాల్గొంటుందన్నారు. డిసెంబర్ 11 నుంచి ప్రారంభం కానున్న జాతీయస్థాయి ఫుట్‌బాల్ పోటీ లకు రాష్ట్ర జట్టు తరఫున ఆర్తి ఆడుతుందని పేర్కొన్నారు.
రాష్ట్రస్థాయిలో గోల్డ్ మెడల్..
ఆర్తి 2023 –24లో వనపర్తిలో జరిగిన ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చి బంగారు పతకం అందుకున్నారు. జార్ఖండ్‌లో జరిగిన జాతీయ స్థాయి ఫుట్‌బాల్ పోటీల్లో రాష్ట్ర జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించారు. రెండు సా ర్లు రాష్ట్ర స్థాయిలో గోల్డ్ మెడల్, మూడు సార్లు జా తీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నారు. తెలంగాణ ఉ మెన్స్ బెస్ట్ ప్లేయర్ అవార్డు అందుకున్నారు. 2025 డిసెంబర్ 13న హైదరాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో సింగరేణి ఆర్ఆర్ జట్టు తరఫున పుట్‌బాల్ స్టార్ క్రీడాకారుడు లయోనల్ మెస్సీతో ఫుట్‌బాల్ ఆడారు. ఆర్తిది నిర్మల్ జిల్లా రాణాపూర్ తండా కాగా, తల్లిదండ్రులు వ్యవసాయ కూలీ పనులు చేస్తూ జీవనం గడుపుతున్నారు.


