వ్యక్తి మృతికి కారకుల అరెస్టు | - | Sakshi
Sakshi News home page

వ్యక్తి మృతికి కారకుల అరెస్టు

Nov 14 2026 12:23 AM | Updated on Nov 14 2026 12:23 AM

దండేపల్లి: వ్యక్తి మృతికి కారకులైన నిందితులను అరెస్టు చేసినట్లు మంచిర్యాల ఏసీపీ ప్రకాశ్‌ తెలిపారు. శుక్రవారం లక్సెట్టిపేట సీఐ కార్యాలయంలో సీఐ రమణమూర్తితో కలిసి విలేకరులకు వివరాలు వెల్లడించారు. ఈ నెల 10న దండేపల్లి మండలం కంచరబాయి అటవీ సమీపంలో కొందరు వ్యక్తులు వన్యప్రాణుల వేట కోసం విద్యుత్‌ తీగలతో ఉచ్చులు ఏర్పాటు చేశారు. తీగల ఉచ్చుకు తగిలి దమ్మపేటకు చెందిన బోయిడిరెడ్డి(40) మృతిచెందాడు. అతడి భార్య సరిత ఫిర్యాదు మేరకు దండేపల్లి ఎస్సై రాజవర్ధన్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు కారకులైన 11మందిని శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ వెల్లడించారు. నిందితుల నుంచి 8 సెల్‌ఫోన్లు, 2 గొడ్డళ్లు, 12కరల్రు స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. ఎస్సైలు రాజవర్ధన్‌, సురేష్‌, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement