ఆగి ఉన్న ట్రాలీని ఢీకొట్టిన కారు రెండు వాహనాలు ధ్వంసం ప్రమాదం తర్వాత బాధితుడికి బెదిరింపులు
మద్యం
మత్తులో
కాసిపేట: మండల కేంద్రంలో ముగ్గురు పోలీసు కానిస్టేబుళ్లు మద్యం మత్తులో వీరంగం సృష్టించారు. అతిగా మద్యం సేవించి, అతివేగంగా కారు నడిపి రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రాలీని ఢీకొట్టారని స్థానికులు, బాధితులు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో ట్రాలీతోపాటు కారు తీవ్రంగా ధ్వంసం అయ్యాయి. కారు ఎయిర్ బ్యాగులు తెరుచుకోవడంతో అందులో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి గాయాలు కాలేదు. ట్రాలీలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు కారులో ఉన్న వారిని ప్రశ్నించారు. బుధవారం అర్ధరాత్రి ఈ సంఘటన జరుగగా, తొలుత ట్రాలీ మరమ్మతు చేయిస్తామని చెప్పడంతో వివా దం సద్దుమణిగింది. ఆ తర్వాత ఎలాంటి నష్టపరి హారం చెల్లించబోమని బెదిరించారని బాధితుడు చింతల సాగర్ కాసిపేట పోలీస్‌స్టేషన్‌లో శుక్రవా రం ఫిర్యాదు చేశారు. దీంతో విషయం ఆలస్యంగా బయటకు వచ్చింది. ట్రాలీని కారు ఢీకొట్టిన ఘ టనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో న మోదైనట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రమాదానికి కారణమైన వారు దేవాపూర్ పోలీస్‌స్టేషన్‌కు చెందిన ముగ్గురు కానిస్టేబుళ్లు అని పేర్కొంటున్నారు. మద్యం సేవించి ఉండడం, ప్రమాదం జరగడం, కానిస్టేబుళ్లు కావడం వల్ల వేరే డ్రైవర్‌ను మార్చే కుట్ర చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు. కాగా, ఈ విషయమై ఎస్సై శ్రావణ్‌కుమార్‌ను సంప్రదించగా.. కానిసేబుళ్లు కారులో ఉన్నారని, నడిపింది వేరే డ్రైవర్ అని, పూర్తి స్థాయి విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తెలిపారు.


