ఆసిఫాబాద్‌రూరల్: జిల్లాస్థాయి నెట్‌బాల్ బాలబాలికల పోటీలు శుక్రవారం పోటాపోటీగా జరిగాయి. జిల్లా కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ మైదానం ఎస్జీఎఫ్ అండర్ 14, 17 నెట్‌బాల్ పోటీలు బాల,బాలికలు జరిగాయి. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మహేశ్వర్, నెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి తిరుపతి మాట్లాడుతూ జిల్లాస్థాయి నెట్ బాల్ పోటీల్లో మొత్తం 60 మంది క్రీడాకారులు పాల్గొన్నారని, ఉత్తమ ప్రతిభ కనబర్చిన 48 మందిని జోనల్ స్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. అండర్ 14 బాలురు 12 మంది, బాలికలు 12 మంది, అండర్ 17లో బాలురు 12 మంది, బాలికలు 12 మంది జోనల్ పోటీలకు ఎంపిక చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో పీడీలు, పీఈటీలు మల్లేష్, తిరుపతి, శిరీష, ఏడుకొండలు, క్రీడాకారులు పాల్గొన్నారు.


